top of page

బాలుడిపై వీధి కుక్కల దాడి.. చాకచక్యంగా తప్పించుకున్నాడు


ree

హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. తాజాగా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, బాలుడు వేగంగా స్పందించి, చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. కుక్కల చేతికి చిక్కుంటే ఏం జరిగి ఉండేదేననేది ఊహించుకునేందుకే భయానకంగా ఉంది. నాచారం పరిధిలోని మల్లాపూర్ గ్రీన్ హిల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు రోడ్డుపై ఒంటరిగా ఆడుకుంటున్న చిన్న బాలుడిపై రెండు వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

 
 
bottom of page