top of page

వీడియో చూసి నా బిడ్డను గుర్తించ.. ఉజ్జయిని బాధితురాలి తండ్రి

ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో పన్నెండేళ్ల బాలికపై జరిగిన ఘోర అత్యాచార ఘటనలో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఒక బంధువు చూపించిన వైరల్ వీడియో ద్వారా బాధితురాలి తండ్రికి ఈ దారుణం గురించి తెలిసింది.

ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో పన్నెండేళ్ల బాలికపై జరిగిన ఘోర అత్యాచార ఘటనలో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఒక బంధువు చూపించిన వైరల్ వీడియో ద్వారా బాధితురాలి తండ్రికి ఈ దారుణం గురించి తెలిసింది. సత్నా జిల్లాకు చెందిన ఈ బాలిక పాఠశాలకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత దుండగుల బారినపడినట్టు తాజాగా బయటకు వచ్చింది. బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఉజ్జయిని వీధుల్లో బాలిక నడుస్తున్న వీడియోను తన బంధువు చూపించిన తర్వాత ఈ విషయం తెలిసిందని వాపోయారు. సెప్టెంబరు 24 నుంచి ఆమె కనిపించకుండా పోయిందని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెదికి, ఆ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దుండగుల చేతికి చిక్కి న బాలిక ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం తో సాయం కోసం కాలినడకన 8 కి.మీ. నడిచినట్లు వెల్లడికావడం అందరినీ కలచివేసింది


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page