నేడు మంత్రులుగా ప్రమాణం చేయనుంది వీళ్లే..!📢👥
- Suresh D
- Dec 7, 2023
- 1 min read
వీఐపీలు, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీలు, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సభకు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు.. అందుకు తగ్గట్టుగానే భద్రతా ఏర్పాట్లు చేశారు. తాజాగా మంత్రుల జాబితాలో ఉన్నవారికి ఠాక్రే నుంచి ఫోన్లు వెళ్లాయి. 11 మంది మంత్రులతో రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిసింది.📢👥
కేబినెట్ బెర్త్ దక్కించుకున్న వారి వివరాలు
భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం
ఉత్తమ్ కుమార్ రెడ్డి
పొన్నం ప్రభాకర్
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
దామోదర రాజనర్సింహ
దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కొండా సురేఖ
సీతక్క
తుమ్మల నాగేశ్వరరావు
జూపల్లి కృష్టారావు