top of page

స్కూల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులు ప్రకటించిన విద్యాశాఖ

బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అక్టోబర్‌ 13 నుంచి 25 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులు, కాలేజీలకు సెలవులు ఉంటాయని తెలిపింది.

ree

బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అక్టోబర్‌ 13 నుంచి 25 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులు, కాలేజీలకు సెలవులు ఉంటాయని తెలిపింది. దాదాపు 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్‌ 14న బతుకమ్మ పండుగ రానుంది. ఇక దుర్గాష్టమి, మహర్నవమి పండుగలు అక్టోబర్ 22, 23 తేదీల్లో వస్తున్నాయి. మిగతా రెండు రోజులను ఐచ్ఛిక సెలవులు కింద ఇస్తున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు 2023-24 విద్యాసంవత్సరానికి గానూ దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లలో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు అక్టోబర్‌ 5వ తేదీ నుంచి అక్టోబర్‌ 11వ తేదీ వరకు జరగనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లకు మరో రెండు సార్లు సెలవులు రానున్నాయి. ఏడాది డిసెంబర్‌ 22 నుంచి 26వ తేదీ వరకు కూడా తెలంగాణ స్కూళ్లకు క్రిస్టమస్‌ సెలవులు రానున్నాయి. క్రిస్టమస్‌ అనంతరం సంక్రాంతి సెలవులు 5 నుంచి 6 రోజులు రానున్నాయి. ఈ సెలవులను పాటించాలని సూచించింది. ఇంటర్మీడియట్‌ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని పేర్కొన్నది.

 
 
bottom of page