top of page

తెలంగాణ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల..

ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న కానిస్టేబుల్ అభ్యర్ధుల నిరీక్షణకు నేడు తెరపడింది. తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్‌ నియామక తుది ఫలితాలు బుధవారం (అక్టోబర్‌ 4) విడుదలయ్యాయి.

ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న కానిస్టేబుల్ అభ్యర్ధుల నిరీక్షణకు నేడు తెరపడింది. తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్‌ నియామక తుది ఫలితాలు బుధవారం (అక్టోబర్‌ 4) విడుదలయ్యాయి. ఈ మేరకు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. మొత్తంగా 15,750 పోస్టులకు నిర్వహించిన ఈ నియామక ప్రక్రియకు అర్హులైన అభ్యర్థుల వివరాలను నియామక మండలి రేపు వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టనుంది. ఎంపికైన మొత్తం అభ్యర్ధుల్లో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన వివరాలు నేడు అక్టోబర్‌ 5వ తేదీ ఉదయం (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడి చేయనుంది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page