వరంగల్ ఖిల్లాలో రాహుల్ గాంధీ పాదయాత్ర...🚶♂️🌐
- Shiva YT
- Nov 17, 2023
- 1 min read
తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణలో రాహుల్ గాంధీ శుక్రవారం విస్తృతంగా పర్యటిస్తున్నారు. మణుగూరు, నర్సంపేట కార్నర్ మీటింగ్‌ల అనంతరం రాహుల్ గాంధీ వరంగల్ లో ప్రచారం చేస్తున్నారు.

వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజవర్గాల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ నగరంలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. రాహుల్ తో పాటు పలువురు కీలక నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. వరంగల్ తూర్పు అభ్యర్థి కొండా సురేఖ, పశ్చిమ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. 🏞️👣











































