నల్గొండ లో సీఎం కేసీఅర్ భారీ బహిరంగ సభ..’
- Shiva YT
- Nov 20, 2023
- 1 min read
🔄 తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ దూసుకుపోతున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండో విడతగా.. ఇప్పుడు ప్రతీ రోజూ 3-4 నియోజకవర్గాల్లో ప్రజాశీర్వాద బహిరంగసభల్లో పాల్గొంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో విపక్షాలపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం మానకొండూర్, స్టేషన్ ఘనపూర్, నకిరేకల్, నల్గొండ బహిరంగ సభలలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.











































