top of page

మేనిఫెస్టోకు బీజేపీ ఫినిషింగ్ టచెస్.. నాలుగు తాయిలాలతో గిఫ్ట్‌ బాక్స్ రెడీ!🗳️🗳️

తెలంగాణ దంగల్‌లో వెనకబడ్డామన్న వార్తలను కొట్టిపారేస్తూ.. పసందైన మేనిఫెస్టోతో జనం ముందుకు వచ్చేస్తున్నాం అంటోంది కమలం పార్టీ. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లు సాగతోంది కాషాయ దళం. ఇప్పటికే తెలంగాణను రౌండప్ చేసిన బీజేపీ అగ్రనేతల చేతుల మీదుగానే తాయిలాల చిట్టా కూడా విడుదల చేయాలన్నది భారతీయ జనతా పార్టీ ప్లాన్.

తెలంగాణ దంగల్‌లో వెనకబడ్డామన్న వార్తలను కొట్టిపారేస్తూ.. పసందైన మేనిఫెస్టోతో జనం ముందుకు వచ్చేస్తున్నాం అంటోంది కమలం పార్టీ. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లు సాగతోంది కాషాయ దళం. ఇప్పటికే తెలంగాణను రౌండప్ చేసిన బీజేపీ అగ్రనేతల చేతుల మీదుగానే తాయిలాల చిట్టా కూడా విడుదల చేయాలన్నది భారతీయ జనతా పార్టీ ప్లాన్. కానీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మించి బీజేపీ మేనిఫెస్టోలో ఏమేం ఉండబోతున్నాయి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేంత స్టఫ్ ఏముంటుంది అనే ఆసక్తి నెలకొంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో..

ఆరు గ్యారంటీలు ప్లస్ ఆరు డిక్లరేషన్లు.. బిగ్‌ఫైట్‌కు రెడీ అంటోంది కాంగ్రెస్‌ పార్టీ. పాత పథకాలకు కొత్త కలర్లు అద్ది ఎట్రాక్టివ్ స్టయిల్‌తో దంగల్‌లో దూకేసింది అధికార పార్టీ బీఆర్‌ఎస్. తెలంగాణలో మరో అపోజిషన్ పార్టీ బీజేపీ మాత్రం మేనిఫెస్టో రాసుకోవడంలో కాస్త వెనకబడింది. ఇన్నాళ్లూ అభ్యర్థుల జాబితాల కసరత్తుతోనే సరిపోయింది. నామినేషన్ల దాఖలు అఖరి రోజున తుది జాబితాను ప్రకటించింది. అసమ్మతుల్ని బుజ్జగించడం మీదే ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు మరో రెండువారాలు మాత్రమే గ్యాప్ ఉండడంతో ఇప్పుడు ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది బీజేపీ. ముఖ్య నాయకులను రంగంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. నోటిఫికేషన్ వచ్చాక ఇప్పటికే రెండు సార్లు తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, నవంబర్ నెల ఆఖర్లో 25, 26,27 తేదీల్లో మరోసారి సుడిగాలి పర్యటన చెయ్యబోతున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా టూర్‌ కూడా దాదాపుగా ఖరారైంది. నవంబర్ 17న తెలంగాణలో పర్యటిస్తారు అమిత్ షా. ఒకే రోజు నాలుగు సభలకు ప్లాన్ చేసింది తెలంగాణ బీజేపీ. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో అమిత్‌ షా పబ్లిక్ మీటింగ్స్‌కి ఏర్పాట్లు మొదలయ్యాయి. అదే రోజు బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో రిలీజ్ చేయాలన్నది కమలనాథుల ఎన్నికల ఎత్తుగడ. ఇప్పటికే మేనిఫెస్టోను రూపొందించిన కాషాయ దళం.. తుది మెరుగులు అద్దుతోంది. జనరంజకంగా హామీలు ఉండేలా ఫ్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు.🗳️🗳️


 
 
bottom of page