📱 MIUI కి గుడ్‌బై చెప్పిన షావోమి..కొత్త ఓఎస్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటన 🚀
- Shiva YT
- Oct 20, 2023
- 1 min read
🇨🇳 చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమి’ కీలక ప్రకటన చేసింది. కొన్ని సంవత్సరాలుగా షావోమి ఫోన్లలో వాడుతున్న ‘ఎంఐయూఐ’ ఆపరేటింగ్ సిస్టమ్‌కు గుడ్‌బై చెప్పేసింది.

దాని స్థానంలో కొత్త ఓఎస్‌ను తీసుకొస్తున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. షావోమి స్మార్ట్‌ఫోన్స్ వాడే వారందరికీ ‘ఎంఐయూఐ’ సుపరిచితమే. ఈ మొబైల్స్‌లో MIUI ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎంఐయూఐ సాఫ్ట్‌వేర్ బ్రాండ్‌కి ఓ పర్యాయపదంగా మారింది. ఎంఐ, రెడ్‌మీ ఫోన్లతో పాటు పోకో ఫోన్లలో కూడా ఈ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. అంతటి ప్రజాదరణ పొందిన ఎంఐయూకి తాజాగా సంస్థ గుడ్‌బై చెప్పేసింది. 💼📢