top of page

డబ్ల్యూటీసీలో రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా🏏🏆🇮🇳

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించగా. రెండో టెస్ట్ వర్ష కారణంగా డ్రాగా ముగిసింది.

ree

వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించగా.. రెండో టెస్ట్ వర్ష కారణంగా డ్రాగా ముగిసింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లపై ప్రభావం చూపించింది. భారత్ రెండో స్థానానికి పడిపోగా.. పాకిస్థాన్ ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది. విండీస్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన తరువాత భారత్‌ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మొదటి ప్లేస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే రెండో టెస్టు డ్రా కావడంతో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో ఒక విజయం, ఒక డ్రాతో మొత్తం 16 పాయింట్లు ఉన్నాయి. విజయానికి 12 పాయింట్లు రాగా.. డ్రాకు 4 పాయింట్లు యాడ్ అయ్యాయి. విజయశాతం 66.67 శాతం ఉంది. అటు శ్రీలంకపై మొదటి టెస్టులో గెలుపొందిన పాకిస్థాన్ ఖాతాలో 12 పాయింట్లు ఉండగా.. విజయశాతం 100 గా ఉంది. దీంతో పాక్ జట్టు మొదటి స్థానానికి చేరుకుంది.🇮🇳👬🏏


 
 
bottom of page