top of page

వాలంటీర్లకు దినపత్రిక అలవెన్స్ రద్దు

Updated: Jun 26, 2024


గత ప్రభుత్వం వాలంటీర్లు తప్పనిసరిగా ఓ దినపత్రికను కొనుగోలు చేయాలంటూ, అందుకోసం నెలకు రూ.200 అలవెన్స్ కూడా చెల్లించిన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడా అలవెన్స్ ను రద్దు చేసింది. పత్రిక కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ, తాజాగా మెమో జారీ చేసింది. న్యూస్ పేపర్ కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశించింది. సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచేందుకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అలవెన్స్ ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ పెద్ద సంఖ్యలో వాలంటీర్లు టీడీపీ నేతలను కలిసి మొరపెట్టుకుంటున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. కొందరు వాలంటీర్లు వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 
 
bottom of page