top of page

పవన్ కల్యాణ్ విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..

ఎంతో ఉత్కంఠ రేపిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక ఏపీ అసెంబ్లీలో ‘పవన్’ ఫ్యాక్టర్ బాగా కనిపించింది. ఆ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది. అలాగే రెండు ఎంపీ సీట్లను సైతం కైవసం చేసుకుంది జనసేన. పదేళ్లుగా రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తింటూ వస్తున్న పవన్ కల్యాణ్‌కు ఈ ఎన్నికల ఫలితాలు తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని అందించాయి.

పవన్ విజయాన్ని ఆయనతో పాటు మెగా ఫ్యామిలీ, అభిమానులు, నెటిజన్లు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన అధిపతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సీనియర్ సురేఖ వాణి కూతురు సుప్రిత జనసేన విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక రీల్ చేసింది. అందులో ‘ఇంకా ఎవడ్రా మనల్ని ఆపేది’ థీమ్ సాంగ్ కు తనదైన స్టైల్ లో స్టెప్పులేసింది.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫొటో, జై జనసేన అని ముద్రించి ఉన్న టీషర్టుతో దర్శనమిచ్చింది సుప్రిత. అలాగే జనసేన సింబల్ గాజు గ్లాసును కూడా పట్టుకుని పోజులిచ్చింది. మొత్తానికి స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ ధరించి జనసేన జెండా, సింబల్ ను చూపిస్తూ తెగ సందడి చేసింది సుప్రిత. జనసేన విజయాన్ని పురస్కరించుకుని కాల్చడానికి సిద్ధంగా ఉన్న క్రాకర్లను కూడా చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page