పఠాన్ 2కి ఇది పెద్ద మార్పే!..🎥
- Suresh D
- Apr 1, 2024
- 1 min read
కింగ్ ఖాన్ షారుక్ ఇటీవల పఠాన్ 2కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2023లో వచ్చిన పఠాన్ సినిమాకి ఇది సీక్వెల్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి షారుక్ ఓకే చెప్పారన్న అప్‌డేట్ తప్ప ఇప్పటివరకూ ఎలాంటి న్యూస్ రాలేదు. కానీ సడెన్‌గా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పఠాన్ 2 సినిమాకి డైరెక్టర్‌ను ఛేంజ్ చేయాలని యష్ రాజ్ ఫిలిమ్స్ భావిస్తుందని టాక్. పఠాన్‌ను డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్‌ను తప్పించి ఓ కొత్త దర్శకుడికి బాధ్యతలు ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇలా చేయడం వల్ల సినిమాకి ఫ్రెష్ లుక్ వస్తుందని డిసైడ్ అయ్యారని సమాచారం. ఇక పఠాన్ 2 సినిమా యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో 8వ చిత్రం కానుంది. ఇప్పటివరకూ ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3, వార్ 2 సహా ఆలియా భట్ చేస్తున్న ఓ సినిమా కూడా ఈ లిస్ట్‌లో ఉంది. అయితే సిద్ధార్థ్ ఆనంద్‌ను పఠాన్ 2 నుంచి తప్పించడానికి ఫైటర్ సినిమానే కారణమని కొంతమంది భావిస్తున్నారు. ఎందుకంటే హృతిక్ రోషన్‌తో తీసిన ఈ ఎయిర్ యాక్షన్ డ్రామా ఆడియన్స్‌కి పెద్దగా ఎక్కలేదు. అందుకే పఠాన్ 2 నుంచి ఆయన్ను తప్పించారని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో త్వరలోనే తేలనుంది.











































