శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం..
- MediaFx

- Aug 1, 2024
- 1 min read
శేఖర్ మాస్టర్ తమ్ముడు మృతితో ఆయన ఇంట విషాదం నెలకొంది. శేఖర్ మాస్టర్ తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. సుధా నిన్ను మిస్ అవుతున్నాం.. నేను ఎక్కడికెళ్లినా.. ఏం చేసినా.. నువ్వే గుర్తుస్తోన్నావు. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వు మాత్రం ఎక్కడో ఓ చోట ఆనందంగా ఉంటావని అనుకుంటున్నా.. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు. మిస్ యూ రా తమ్ముడు.. అంటూ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ అందరిని కలిచి వేస్తోంది. శేఖర్ మాస్టర్ తమ్ముడి మృతికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శేఖర్ మాస్టర్ కు దైర్యం చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే శేఖర్ మాస్టర్ తమ్ముడి మృతికి గల కారణం ఏంటనేది తెలియలేదు.












































