ధోనీ ఆ ఒక్క కారణంతోనే టీమ్‌లో ఉన్నాడు లేదంటేనా..
- Shiva YT
- May 29, 2023
- 1 min read
Sehwag on Dhoni: ధోనీ ఆ ఒక్క కారణంతోనే టీమ్‌లో ఉన్నాడు.. లేదంటేనా అంటూ సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సీఎస్కేలో కేవలం కెప్టెన్సీ కోసమే అతడు ఆడుతున్నాడని, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అతనికి వర్తించదని వీరూ అభిప్రాయపడ్డాడు.

ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడా లేదా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. ధోనీ సహా. నిజానికి వచ్చే ఏడాది ధోనీ కచ్చితంగా ఆడతాడని, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అతని కెరీర్ ను మరింత పొడిగించిందని సీఎస్కే బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో చెప్పిన విషయం తెలుసు కదా. కానీ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం దీనితో విభేదిస్తున్నాడు.