బుర్జ్ ఖలీఫా పై నుంచి చూస్తే భూమి ఎలా ఉంటుందో తెలుసా..?
- MediaFx

- Aug 10, 2024
- 1 min read
బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు 828 మీటర్లు. అంటే 2,717 అడుగులు ఈ బిల్డింగ్ మొత్తం 163 అంతస్తులను కలిగి ఉంది. అంత ఎత్తైన భవనం నుండి దిగువన దృశ్యం ఎలా ఉంటుంది? అక్కడ నుండి భూమి, దుబాయ్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మహ్మద్ ఆకిబ్ Instagram వీడియోలలో చూపించారు. మహ్మద్ ఆఖీబ్ ఈ దృశ్యాన్ని ప్రపంచం ముందు తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఎవరూ ఊహించని దృశ్యం కావడంతో అతని వీడియో కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. తెల్లటి మేఘాలు చుట్టుముట్టిన ఆకాశం మరో ప్రపంచంలా అనిపిస్తుంది. వీడియోలో, బుర్జ్ ఖలీఫా పై అంతస్తు నుండి క్రింది దృశ్యం చూపించారు. అందులో తెల్లటి మేఘాలు, నీలి ఆకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియోలో యువకుడు బాల్కనీ తలుపు తెరిచి కెమెరాను కిందకు చూపించాడు.. దాంతో దిగువ దృశ్యం మేఘాల ప్రపంచంలా కనిపిస్తుంది.












































