సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వచ్చేస్తుందోచ్.. 🎬🎭
- Suresh D
- Jul 27, 2023
- 1 min read
ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య, రోహిణీ కీలక పాత్రల్లో తెరెక్కిన వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్‌కు అపూర్వ ఆదరణ దక్కింది.

ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య, రోహిణీ కీలక పాత్రల్లో తెరెక్కిన వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమైన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్‌కు అపూర్వ ఆదరణ దక్కింది. భార్యా బాధిత భర్తల చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. యాత్ర సినిమాతో తో పాపులర్ అయిన మహీ వి రాఘవ్ ఈ సిరీస్‌కు క్రియేటర్‌గా వ్యవహరించాడు. తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. కిడ్నాప్ మిస్టరీతో మంచి ట్విస్ట్ ఇచ్చి మొదటి సీజన్‌ను ముగించిన మేకర్స్ ఇప్పుడు సెకెండ్ సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు మూడు లేదా నాలుగో వారంలో సేవ్ ద టైగర్స్ సెకెండ్ సీజన్‌ను ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.👍😄🎞️











































