ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయాన్ని అన్వేషిస్తూనే ఉంటారు: 'సర్వం శక్తిమయం' ట్రైలర్ లాంచ్!🎞️🎥
- Suresh D
- Oct 18, 2023
- 1 min read
ఇంతవరకూ భక్తిరస ప్రధానమైన సినిమాలు .. సీరియల్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు భక్తిరస ప్రధానమైన వెబ్ సిరీస్ ను అందించడానికి 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ రెడీ అవుతోంది. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 20వ తేదీ నుంచి 'సర్వం శక్తిమయం' అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ ను అందించనున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. పండుగ సందర్భానికి తగినట్టుగానే, 18 శక్తి పీఠాల చుట్టూ తిరిగే కథ ఇది. 10 ఎపిసోడ్స్ గా రూపొందించిన ఈ సిరీస్, అష్టాదశ శక్తి పీఠాలను పరిచయం చేస్తూ ముందుకు వెళుతుంది. 🎞️🎥