top of page

హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన దేత్తడి హారిక 🎞️🎥

'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారిక హీరోయిన్ గా లాంచ్ అవుతోంది. 'బేబీ' మేకర్స్ నిర్మాణంలో రూపొందే సినిమాలో సంతోష్ శోభన్ కు జోడీగా నటించనుంది.

సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో రూపొందిన 'బేబీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యను హీరోయిన్ గా పరిచయం చేసిన మేకర్స్.. ఇప్పుడు అలేఖ్య హారికను హీరోయిన్ గా లాంచ్ చేస్తున్నారు. తమ బ్యానర్ లో రానున్న ప్రొడక్షన్ నెం. 4 సినిమాలో హారికను కథానాయికగా తీసుకున్నారు. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయడమే కాదు, పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌ గా ప్రారంభించారు. అలానే ప్రీ లుక్ పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు.

మాస్ మూవీ మేకర్స్ & అమృత ప్రొడక్షన్స్‌ బ్యానర్స్ పై ఈ సిినిమా తెరకెక్కనుంది. ఎస్‌కెఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సాయి రాజేష్ స్టోరీ - స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు సోమవారం ఉదయం హైదరాబాద్‌ లో జరిగింది. దీనికి యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ముఖ్య అథితిగా హాజరై బెస్ట్ విషెస్ అందజేశారు. క్లాప్ కొట్టి, డైరెక్టర్ చందు మొండేటితో కలిసి స్క్రిప్ట్ అందించారు. యువ హీరో అక్కినేని సుశాంత్, దర్శకులు హరీశ్ శంకర్, వశిష్ట, మైత్రీ మూవీస్ ప్రొడ్యూసర్ వై. రవి శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.🎞️🎥


 
 
bottom of page