ఇప్పుడు స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్ ఉన్న హీరోయిన్..
- Shiva YT
- May 13, 2023
- 1 min read
ఈ చిత్రంలోని బాలిక ఎవరో గుర్తుపట్టగలరా..? తను ఇప్పుడు స్టార్ హీరోయిన్. అందంలో పాలిరాతి శిల్పం. అభినయంలో తన మార్క్ స్పష్టం. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూనే.. రొమాంటిక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. మీరు తనని గుర్తుపట్టగలరా..?

తను మరెవరో కాదు.. ఏమాయచేసావే అంటూ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న సమంత. తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్గా కొనసాగింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైంలోనే నాగచైతన్యను ప్రేమ వివాహాం చేసుకుంది సామ్. పెళ్లి తర్వాత సమంత లేడీ ఒరియేంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది సమంత. టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ అంటూ పిలుచుకునేవారు అక్కినేని అభిమానులు. కానీ వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఆ కుంగుబాటు నుంచి కోలుకునేందుకు సమంతకు చాలా సమయం పట్టింది. నాగచైతన్య, సమంతల విడాకులపై ఫ్యామిలీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. రకరకాల రూమర్స్ వచ్చాయి. ఈ జంట విడిపోవడానికి కారణాలను మాత్రం బయటపెట్టలేదు. విడాకుల అనంతరం తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టింది సమంత. పలు పుణ్యక్షేత్రాలు దర్శించి.. కొత్త శక్తితో తీరిపై కెరీర్‌పై ఫోకస్ పెట్టి సినిమాలు చేస్తుంది.
ఆ తర్వాత తనపై దుష్ప్రచారం చేస్తూ వస్తున్న ట్రోల్స్‌పై కోర్టు మెట్లు ఎక్కింది. అటు తర్వాత మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడింది. ఇటీవల నటుడు, నిర్మాతగా చెప్పుకునే పెద్ద మనిషికి నెట్టింట క్లాస్ పీకి వైరల్ అయ్యింది. ప్రజంట్ విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటిస్తోంది సామ్.