ప్రభాస్ - సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ 🎬🌟
- Suresh D
- Dec 18, 2023
- 1 min read
సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. ఉదయం రిలీజ్ కావాల్సిన ట్రైలర్‌ను మధ్యాహ్నం రెండు గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ట్రైలర్ రిలీజ్ పోస్ట్‌పోన్ కావడంతో ప్రశాంత్ నీల్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్‌ను ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ డిసపాయింట్ చేసింది. సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ వాయిదాపడింది. ది ఫైనల్ పంచ్ పేరుతో సలార్ సెకండ్ ట్రైలర్‌ను సోమవారం ఉదయం 10.42 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ట్రైలర్ రిలీజ్‌కు నాలుగు నిమిషాల ముందు అభిమానులకు షాకిచ్చింది. సలార్ సెకండ్ ట్రైలర్‌ను 10.42 నిమిషాలకు కాకుండా మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
రెండోసారి ట్రైలర్ రిలీజ్ పోస్ట్‌పోన్ కావడంతో హోంబలే ఫిల్మ్స్‌తో పాటు ప్రశాంత్ నీల్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడుతోన్నారు. ట్రైలర్ మాదిరిగా సినిమా షోస్ మాత్రం డిలే చేయవద్దంటూ హోంబలే ఫిల్మ్స్‌కు నెటిజన్లు సలహా ఇస్తున్నారు. ట్రైలర్‌కు సంబంధించిన కొన్ని పనులు పూర్తికాకపోవడంతోనే మధ్యాహ్నానికి పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రచారం జరగుతోంది. తొలుత ఈ ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్‌పోన్ చేసి సోమవారం రిలీజ్ చేస్తోన్నారు.🎥









































