వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహం.. 🏟️
- Suresh D
- Oct 20, 2023
- 1 min read
ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నవంబర్ 2 న వాంఖడే స్టేడియం ప్రాంగణంలో సచిన్ టెండూల్కర్ లైఫ్ సైజ్ స్టాట్యూని ప్రారంభించనుంది. ఈమేరకు గురువారం ఒక ఇంటరాక్షన్‌లో MCA అధ్యక్షుడు అమోల్ కాలే ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, సచిన్ టెండూల్కర్ స్టాండ్ సమీపంలో ఈ విగ్రహాన్ని నవంబర్ 2 న శ్రీలంకతో టీమిండియా ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు సచిన్‌తోపాటు పలువురు ప్రముఖులు, భారత జట్టు సభ్యులు కూడా ఈ వేడుకకు హజరుకానున్నారు. “మేం షెడ్యూల్, సమయాన్ని ఖరారు చేశాం” అని ఆయన తెలిపారు. ✨🏏
