top of page

బ‌బుల్‌గ‌మ్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?🎥🎞️

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఫిబ్రవరి 9 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి రవి పేరేపు దర్శకత్వం వహించగా.. తెలుగమ్మాయి మానస చౌదరి కథానాయికగా పరిచయమైంది.🎥🎞️

ree

యాంకర్ సుమ కనకాల, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. రొమాంటిక్ యూత్ ఎంటర్టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ నెలలో అడియన్స్ ముందుకు వచ్చింది. విడులకు ముందే టీజర్, ట్రైలర్ ఈ మూవీపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది. మొదటిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా.. కమర్షియల్ గా అంత హిట్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఫిబ్రవరి 9 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి రవి పేరేపు దర్శకత్వం వహించగా.. తెలుగమ్మాయి మానస చౌదరి కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది మానస. ఇందులో చైతూ జొన్నలగడ్డ, హర్ష, అను హాసన్, కిరణ్ మచ్చా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహకారంతో మహేశ్వరి మూవీస్ ఈ సినిమాను నిర్మించింది.

బబుల్ గమ్ సినిమా ప్రమోషన్స్ యాంకర్ సుమ దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమా కోసం స్టార్ హీరోస్ చిరంజీవి, వెంకటేష్, నాని, అడివి శేష్ తోపాటు.. సీనియర్ నటీనటులు ప్రమోషన్లలో పాల్గోన్నారు. మొదటి సినిమాతోనే తన నటనతో మంచి మార్కులు అందుకున్నాడు. మానస, రోషన్ ఇద్దరికీ మొదటి సినిమా కావడం.. ఇద్ది స్క్రీన్ ప్రెజన్స్, కెమెస్ట్రీ బాగుందని టాక్ వినిపించింది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

కథ విషయానికి వస్తే.. ఇందులో అదిత్య అనే పాత్రలో కనిపించాడు రోషన్ కనకాల. అతడికి డీజే కావాలని కల ఉంటుంది. కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఓ పార్టీలో జాన్వీ (మాన చౌదరి)తో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. మొదట్లో ఆదిత్యతో ప్రేమగా టైమ్ పాస్ గా భావించిన జాన్వీ ఆ తర్వాత అతడి వ్యక్తిత్వం నచ్చి ఇష్టపడుతుంది. జాన్వీ పుట్టిన రోజు జరిగిన ఓ సంఘటన వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. అదే పార్టీలో ఆదిత్యను దారుణంగా అవమానిస్తుంది జా్వీ. ఆ తర్వాత ఏమైంది ?.. జాన్వీ చేసిన అవమానాన్ని ఆదిత్య ఎలా తీసుకున్నాడు ?.. రెండు విభిన్న నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ ఆఖరికి ఏం జరిగింది ?. అనేది సినిమా.🎥🎞️

 
 
bottom of page