top of page

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితిపై సీఎంకు రేవంత్ లేఖ ..

జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR) టీపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ రాశారు. తమ ప్రభుత్వంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. గత 12 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని విమర్శించారు. దేశంలోనే మా పంచాయతీలు ఆదర్శం అందుకే కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది అని గొప్పలు చెప్పుకుంటోందని.. ఆ గొప్పల వెనుక జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పడిన శ్రమ ఉందన్నారు. వారి కష్టంతో రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు 79 అవార్డులు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని ఆయన తెలిపారు.అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా అని నిలదీశారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచి, వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు కూడా సిద్ధమవుతామని రేవంత్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page