top of page

సొంత మైదానంలో చెలరేగిన కింగ్


అచ్చొచ్చిన మైదానం చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2024లో సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విజయం అందించాడు. పంజాబ్ కింగ్స్ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. ఒత్తిడిలో దినేష్ కార్తీక్, శశాంక్ సింగ్ అద్భుతంగా రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ, కోహ్లీ నినాదాలు మార్మోగిన వేళ సొంత మైదానం బెంగళూరులో ఆర్సీబీ విజయం సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన వేళ చివరికి.. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఓవర్ రెండో బంతికే క్యాచ్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ కోహ్లీ.. అదే ఓవర్‌లో నాలుగు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. ఆది నుంచి విరుచుకుపడి ఆడిన కోహ్లీ 77 పరుగులు (49 బంతుల్లో, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page