top of page

స్నాప్‌చాట్‌లో పరిచయం.. 9వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం


ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. మహిళలపై అఘయిత్యాలు మాత్రం ఆగటం లేదు. ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆడవారు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ ఎస్సానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలికను బెదిరించి, బ్లాక్‌మెయిల్‌ చేసి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు నిందితుడిపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అమీర్‌పేట-బల్కంపేట రోడ్డులోని సోనాబాయి ఆలయం సమీపంలో ఉంటున్న గణేష్‌ యాదవ్‌ (20) అదే ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలిక (14)తో స్నాప్‌చార్ట్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఆపై ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వీడియోలతో బెదిరించి బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెండుసార్లు అత్యాచారం చేశాడు. మనస్తాపంతో గత కొంత కాలంగా బాలిక పాఠశాలకు వెళ్లడం లేదు. దీంతో తల్లి బాలికను ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page