top of page

154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!


ree

150 ఏళ్ల క్రితం అంతరించి పోయింది అనుకున్న అడవి జంతువు మళ్ళీ ప్రత్యక్షమైంది. దీంతో వన్యప్రాణి ప్రేమికుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. నల్లమల అభయారణ్యంలో ఈ జంతువు సంచరిస్తుండగా అటవీ శాఖ అధికారుల కంటపడటంతో ప్రత్యక్షంగా చూసి నిర్ధారించుకుని ఆనందంతో పొంగిపోయారు. నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న కనిపించింది. ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలోని బైర్లూటి రేంజ్‌లో కెమెరా ట్రాప్‌లో దాని చిత్రాలు నమోదయ్యాయి. మన దేశంలోని పశ్చిమ కనుమల్లో సంచరించే అడవి దున్నలు నల్లమలలో కనిపించడంతో అటవీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. 1870 తర్వాత మళ్లీ ఇది కనిపించినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్‌లో మొదటిసారి అడవి దున్నను గుర్తించినట్లు అటవీ అధికారులు తెలిపారు. అక్కడినుంచి అది గత నెలలో బైర్లూటి రేంజ్‌లోకి వచ్చిందని పేర్కొన్నారు. కర్ణాటక వైపు నుంచి ఈ దున్న కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నామన్నారు.

 
 
bottom of page