హీరోగా తనను తాను చూసుకోని ఎమోషనల్ అయిన రావు రమేశ్.. వీడియో
- MediaFx
- Aug 25, 2024
- 1 min read
టాలీవుడ్ సినీ దిగ్గజం రావు గోపాలరావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు రావు రమేశ్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం (Maruthi Nagar Subramanyam ). ఇంద్రజ హీరోయిన్‌గా నటించగా.. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాను అభిమానులతో కలిసి రామానాయుడు స్టూడియోలో చూశారు రావు రామేష్. ఈ సినిమా చూసిన అనంతరం మూవీకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి దర్శకుడు లక్ష్మణ్‌ను అభినందిస్తూ ఎమోషనల్‌కు గురయ్యాడు. మనమే చేశామా ఈ సినిమాను ఇంతా బాగుంది అంటూ రావు రమేష్ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.