top of page

సింగిల్‌ చార్జ్‌పై 250 కిలోమీటర్లు.. సరికొత్త ప్రాణ ఈవీ బైకులు


చెన్నై, ఆగస్టు 22: తమిళనాడుకు చెందిన శ్రీవారు మోటర్స్‌.. గురువారం తమ ప్రీమియం ఎలక్ట్రిక్‌ మోటర్‌సైకిల్‌ ప్రాణ 2.0 మాడల్‌ను ఆవిష్కరించింది. చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.2,55,150. సింగిల్‌ చార్జింగ్‌పై 150 కిలోమీటర్లదాకా ప్రయాణం చేయవచ్చు. కాగా, ఈ సందర్భంగానే ప్రాణ ఎలైట్‌ బైక్‌నూ మార్కెట్‌కు పరిచయం చేసింది శ్రీవారు మోటర్స్‌. చెన్నై ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.3,20,250గా ఉన్నది. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 250 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. 2021లో ఎలక్ట్రిక్‌ మోటర్‌సైకిల్‌ ప్రాణను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. తాజాగా ఇప్పుడు దాని అప్‌డేట్‌ వెర్షన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. కోయంబత్తూర్‌ సమీపంలోని సూలూర్‌లో ఈ సంస్థకు ప్లాంట్‌ ఉన్నది.

ఇక్కడ నెలకు దాదాపు 2వేల బైకులు తయారవుతాయని ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక సీఈవో మోహన్‌రాజ్‌ రామస్వామి తెలిపారు. 10వేల యూనిట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నది. త్వరలో ‘ఎలైవ్‌’ పేరిట ఎలక్ట్రిక్‌ స్కూటర్లనూ తేవాలని కంపెనీ చూస్తున్నది.


 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page