దళపతి విజయ్ లియో మూవీలో రామ్ చరణ్.. ఇదిగోండి ప్రూఫ్🎞️🎥
- Suresh D
- Oct 10, 2023
- 1 min read
దళపతి విజయ్ లియో మూవీలో రామ్ చరణ్ నటించాడా? ఇదిగోండి ప్రూఫ్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. అందులో లియోలో నటించిన వారి పేర్లు ఉండగా.. రామ్ చరణ్ కూడా ఉండటం విశేషం.

దళపతి విజయ్ నటించిన మూవీ లియో. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడగా.. ఇప్పుడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో కనిపించాడన్న వార్త మరోసారి తెరపైకి వచ్చింది. నిజానికి గతంలోనే ఓసారి ఈ వార్త వచ్చినా.. తర్వాత మెల్లగా అది సైడైపోయింది.తాజాగా చరణ్ పేరు మరోసారి లియో మూవీతో లింకవడానికి ఓ బలమైన కారణమే ఉంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అమెరికాలో ప్రారంభమయ్యాయి. అందులో ఓ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ లియో మూవీలోని నటీనటుల వివరాలు చెబుతూ.. రామ్ చరణ్ పేరు కూడా రాయడం విశేషం. ఈ వెబ్‌సైట్లోని సమాచారం తప్పయ్యే అవకాశం కూడా ఉంది.కానీ ఒకవేళ అదే నిజమైతే మాత్రం అభిమానులకు పండగే. దళపతి విజయ్, రామ్ చరణ్ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు కనులపండుగలా ఉంటుందనడంలో సందేహం లేదు. సదరు టికెట్ బుకింగ్ వెబ్ సైట్లో జోసెఫ్ విజయ్ పేరుతోపాటు రామ్ చరణ్, త్రిష, అనురాగ్ కశ్యప్, గౌతమ్ మేనన్, అర్జున్ సర్జా, మాథ్యూ థామస్, సంజయ్ దత్ పేర్లు ఉన్నాయి.🎞️🎥