top of page

ఇప్పటివరకు ఏ బ్రాండ్ ప్రమోట్ చేయని ఏకైక హీరో..🎥🎞️

సాధారణంగా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఏదో ప్రకటన చేస్తూనే ఉంటారు. ఇక ఫేమస్ సెలబ్రెటీస్ తో తమ కంపెనీ బ్రాండ్ యాడ్స్ చేయడానికి వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తుంటారు.కానీ మీకు తెలుసా ?. సౌత్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో ఇప్పటివరకు ఏ బ్రాండ్ ను ప్రమోట్ చేయలేదు.

ree

సాధారణంగా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఏదో ప్రకటన చేస్తూనే ఉంటారు. ఇక ఫేమస్ సెలబ్రెటీస్ తో తమ కంపెనీ బ్రాండ్ యాడ్స్ చేయడానికి వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తుంటారు.కానీ మీకు తెలుసా ?. సౌత్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో ఇప్పటివరకు ఏ బ్రాండ్ ను ప్రమోట్ చేయలేదు. కానీ ఆయన సినిమా విడుదలైతే మాత్రం కోట్లల్లో వసూళు రాబడతారు. ఎవరో తెలుసా ?. అతనే సూపర్ స్టార్ రజినీకాంత్. 72 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ అగ్రకథానాయకుడిగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నారు.1975లో తమిళ్ చిత్రం అపూర్వ రాగంగల్ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఈ మూవీ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఎన్నో కోట్లు సంపాదించిన రజినీ.. ఇప్పటికీ సింపుల్ లైఫ్ గడిపేందుకు ఇష్టపడతారు. రజినీ ఆస్తి విలువ రూ.430 కోట్లు. కానీ ఇప్పటివరకు ఆయన ఏ బ్రాండ్ చేయలేదు. సౌత్ ఇండస్ట్రీలో ఏ బ్రాండ్ ప్రమోట్ చేయని ఏకైక హీరో రజిని మాత్రమే.🎥🎞️


 
 
bottom of page