తాను కండక్టర్‌గా పని చేసిన బస్ డిపోను సందర్శించిన రజనీకాంత్..🌟📽️
- Suresh D
- Aug 29, 2023
- 1 min read
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ డిపోను సందర్శించారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ డిపోను సందర్శించారు.మంగళవారం జయనగర్ బీఎంటీసీ డిపోకు ఉదయం 11:30 గంటలకు రజనీకాంత్ చేరుకున్నారు. ఆయన రాక పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. 11:45 వరకు రజనీకాంత్ డిపోలోనే ఉన్నారు. సిబ్బందితో రజనీ మాట్లాడారు.కొద్దిసేపు అక్కడున్న సిబ్బందితో మాట్లాడిన రజనీకాంత్ డిపో లోపలే తిరిగారు. అక్కడ ఆయన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అందరూ రజనీతో సెల్ఫీలు దిగారు.హీరో కాకముందు రజినీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. జయనగర్ డిపోలో పనిచేశారు. అందుకే ఇక్కడికి వచ్చారు. తన స్నేహితుడు రాజ్ బహదూర్ కూడా రజనీతో ఉన్నాడు.🌟📽️








































