top of page

పూరీ జగన్నాథుని చందనోత్సవంలో అపశ్రుతి.. బాణాసంచా పేలి 15 మందికి తీవ్ర గాయాలు

🚨 పూరీ జగన్నాథుని ఆలయ ఉత్సవంలో జరిగిన ప్రమాదంలో 15 మంది భక్తులు గాయపడ్డారు. బుధవారం రాత్రి నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో టపాసులు పేలడంతో నిప్పురవ్వలు సమీపంలో నిల్వ ఉంచిన బాణసంచా పేలాయి. దీంతో పలువురు గాయపడ్డారు. కొంతమంది భక్తులు అగ్నిప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పుష్కరిణిలోకి దూకారు.

గాయపడిన వారిని పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

ఇదిలా ఉంటే, జగన్నాథుని రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు శ్రీక్షేత్రంలో కొనసాగుతున్నాయి. రథచక్రాలకు ఇరుసుల అమరిక ఘట్టం బుధవారం విజయవంతంగా పూర్తయింది.

 
 
bottom of page