🌟🏡 వరుస బెట్టి ఆస్తులన్నింటినీ అమ్మకానికి పెట్టేస్తోన్న ప్రియాంక చోప్రా.. 🌟
- Shiva YT
- Nov 18, 2023
- 1 min read
ప్రియాంక చోప్రా తన ఆస్తులన్నింటినీ విక్రయిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇండియాతో తనకున్న సంబంధాన్ని తెంచుకోవాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

అందుకే ముంబైలో వరుస బెట్టి తన ఆస్తులను అమ్మకానికి పెడుతోందని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం పలు ఇంగ్లిష్ సీరియల్స్, సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు రెండో సీజన్ షూటింగ్‌లో బిజీగా ఉంటోందీ గ్లోబల్ స్టార్. అలాగే హెడ్స్ ఆఫ్ స్టేట్ తో పాటు పలు వెబ్‌సీరీస్‌ల్లోనూ నటిస్తోందీ అందాల తార. ఆ మధ్యన ఓ హిందీ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినా ఏమైందో తెలియదు కానీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. 🌟💼