top of page

'కాంతార' కొత్త చాప్టర్ ఫస్ట్ లుక్ - ఈసారి కాంతి కాదు, దర్శనమే! అంచనాలు పెంచిన రిషబ్🎥✨

'కాంతార'కు ప్రీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు 'కాంతార : ఏ లెజెండ్' చాప్టర్ 1 అని టైటిల్ ఖరారు చేశారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేశారు.

కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'కాంతార'. కర్ణాకట వ్యాప్తంగా, దేశంలోని ఇతర నగరాల్లో కన్నడ వెర్షన్ థియేటర్లలో విడుదలైన సమయంలో ఆ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కన్నడలో తీసిన ఆ సినిమా ఇతర భాషలో అనువాదమై... ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. 'కాంతార' భారీ విజయం సాధించడంతో దానిని ఓ ఫ్రాంచైజీ తరహాలో ముందుకు తీసుకు వెళ్లాలని రిషబ్ శెట్టి డిసైడ్ అయ్యారు. 'కాంతార'కు ప్రీక్వెల్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు 'కాంతార : ఏ లెజెండ్' చాప్టర్ 1 అని టైటిల్ ఖరారు చేశారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ నెల 27న... అంటే సోమవారం నాడు 'కాంతార 2' విడుదల చేయనున్నారు.

'కాంతార' సినిమా గుర్తు ఉందా? సినిమా ప్రారంభంలో హీరో తండ్రి, చివరలో హీరో దట్టమైన చెట్ల మధ్యలోకి వెళతారు. అక్కడ ఒక్కసారిగా మాయం అవుతారు. ఆ సమయంలో ఓ కాంతి కింద వస్తుంది. దాన్ని గుర్తు చేసేలా కొత్త 'కాంతార' సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. 'అది కాంతి మాత్రమే కాదు... దర్శనం' అంటూ ఈ నెల 27న మధ్యాహ్నం 12.55 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని రిషబ్ శెట్టి ట్వీట్ చేశారు. 🎥✨


 
 
bottom of page