top of page

ఇటలీలో ప్రభాస్ సలార్ షూటింగ్...


ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కకుతున్న ‘సలార్’ మూవీ షూటింగ్ వడివడిగా సాగుతోంది. ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు 85శాతం షూటింగ్ పూర్తయిందట. సెప్టెంబరు 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రిలీజ్ విషయంలో సందేహాలు ఉండబోవని తెలుస్తోంది. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ సినిమాను నిర్మిస్తోంది.

 
 
bottom of page