top of page

కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్ సీలింగ్

Updated: Apr 2, 2024


అస్సాంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. తుఫానుతో కూడిన భారీ వర్షం ధాటికి గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఉన్న సీలింగ్‌లో ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే.. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవటంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. సీలింగ్‌లో కొంత భాగం కూలిపోవడంతో విమానాశ్రయం అధికారులు కొద్దిసేపు కార్యకలాపాలను నిలిపివేశారు. ఆరు విమానాలను ఇతర గమ్యస్థానాలకు మళ్లించారు. అయితే.. ఈ విమానాశ్రయం అదానీ గ్రూప్ నియంత్రణలో ఉండటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


 
 
bottom of page