top of page

🎉🕶️ బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలే!

బాలకృష్ణ కొన్ని ఆయుధాలతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇస్తాడు. తమపై యుద్ధం ప్రకటిస్తున్నారా అని ఓ రౌడీ బాలయ్యను అడుగుతాడు. అప్పుడు బాలయ్య మాట్లాడుతూ నక్కలను వెటాడితే వార్ అనరని, దాన్ని వేట అంటారని పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు.

ree

 ఆ డైలాగ్ తర్వాత బాలయ్యను ఎలివేట్ చేస్తూ కొన్ని స్టైలిష్ షాట్స్ ఉంటాయి. ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే బాబీ బాలకృష్ణను మాస్ అవతారంలో ప్రెజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ బాణీలు సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

భగవంత్ కేసరి విజయం ద్వారా బాలయ్య ఈ సినిమాలో నటిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ఇచ్చిన బాబీ నుంచి ఈ మూవీ వస్తుండటంతో టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య మరోసారి పవర్ పుల్ రోల్ లో కనిపిస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 🌟🔥🎥

 
 
bottom of page