పవన్ కళ్యాణ్ పవర్ అలర్ట్.. ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీపై నాగబాబు పోస్ట్!
- Shiva YT
- Jul 3, 2023
- 1 min read
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నందున ప్రజలకు వీలైనంత దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తు్న్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాను యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్న పవన్.. త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇస్తారని మెగా బ్రదర్ నాగబాబు కన్‌ఫర్మ్ చేశారు.

జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో తీరికలేకుండా గడుపుతున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ను సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్న పవన్.. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సెకండ్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారు. ఇలా సెట్స్‌పై ఉన్న సినిమాలకు టైమ్ కేటాయిస్తూనే పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు పవన్. ఇందుకోసమే సోషల్ మీడియా ద్వారా అభిమానులు, పార్టీ కార్యకర్తలకు నిత్యం టచ్‌లో ఉండానుకుంటున్నారు. ఈ మేరకు త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. ఇదే విషయాన్ని మెగా బ్రదర్ నాగ బాబు అధికారికంగా ధ్రువీకరించారు.ఎపీలో పాలిటిక్స్ వేడెక్కాయి. మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నందున ప్రధాన రాజకీయ పార్టీలు వీలైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియాను యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఆయన త్వరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరవనున్నట్లు ఆయన బ్రదర్, జనసేన సెక్రటరీ జనరల్ నాగ బాబు అఫిషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు. అయితే సరిగ్గా ఏ తేదీన అనేది ఇంకా వెల్లడించలేదు.











































