top of page

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ 🇵🇰 ఆడుతుందా? 🤔

త్వరలో వన్డే ప్రపంచకప్ 2023 🏆 ప్రారంభం కానుంది. ఈసారి ప్రపంచకప్‌లో ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్ 🇵🇰 ఆడుతుందా లేదా అనేది సందేహంగా మారింది. ప్రపంచమంతా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూసే మ్యాచ్‌ను క్రికెట్ 🏏 ప్రేమికులు మిస్ కానున్నారా..అవుననే సమాధానం వస్తోంది.

త్వరలో వన్డే ప్రపంచకప్ 2023 🏆 ప్రారంభం కానుంది. ఈసారి ప్రపంచకప్‌లో ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్ 🇵🇰 ఆడుతుందా లేదా అనేది సందేహంగా మారింది. ప్రపంచమంతా ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూసే మ్యాచ్‌ను క్రికెట్ 🏏 ప్రేమికులు మిస్ కానున్నారా..అవుననే సమాధానం వస్తోంది. 2023 ప్రపంచకప్‌లో అత్యంత రసవత్తరమైన ఘట్టం ఉండకపోవచ్చు. ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్ 🇵🇰 ఆడకపోవచ్చు. రెండ్రోజుల క్రితం పాకిస్తాన్ క్రీడా శాఖ మంత్రి ఇషాన్ మజారీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఆసియా కప్ 2023లో హాజరయ్యేందుకు ఇండియా 🇮🇳 తమ దేశానికి రాకుంటే..వన్డే ప్రపంచకప్‌కు పాకిస్తాన్‌ను ఇండియాకు పంపించమని ఆయన స్పష్టం చేయడమే ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే...పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2023లో భద్రతను కారణంగా చూపిస్తూ ఇండియా 🇮🇳 తప్పుకుంది. పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహిస్తే హాజరుకామని, తటస్థ వేదికైతే ఆడతామని హైబ్రిడ్ మోడల్‌ను ఇండియానే తెరపైకి తీసుకొచ్చింది బీసీసీఐ. వన్డే ప్రపంచకప్ 2023 విషయంలో పాకిస్తాన్ ఇప్పుడదే అస్త్రాన్ని సంధిస్తోంది. ఆసియా కప్ 2023 కు ప్రతిపాదించినట్టుగా ప్రపంచకప్ మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికలు కేటాయించాలని పాకిస్తాన్ క్రీడా మంత్రి ఇషాన్ మజారీ స్పష్టం చేశారు. తటస్థ వేదికలైతేనే పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంటుందని లేకపోతే పంపించమని స్పష్టం చేశారు.

 
 
bottom of page