అలనాటి అందాలతార మరోసారి తెర పైకి.. 🎥💃
- Suresh D
- Aug 1, 2023
- 1 min read
అప్పట్లో రాణించిన హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అత్త, అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు సీనియర్ హీరోయిన్స్. కొంతమంది తమ అద్భుత నటనతో సినిమాకే హైలైట్ గా నిలుస్తున్నారు.

అప్పట్లో రాణించిన హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అత్త, అమ్మ, వదిన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు సీనియర్ హీరోయిన్స్. కొంతమంది తమ అద్భుత నటనతో సినిమాకే హైలైట్ గా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హీరోయిన్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె మరెవరో కాదు అర్చన. అర్చన అసలు పేరు సుధా. ఆమె తమిళ్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. తమిళ్ తోపాటు, తమిళ్, బెంగాలీ, మలయాళం, కన్నడ, హిందీ, ఒడియా, ఇంగ్లిష్ భాషల్లో సినిమాలు చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఇక తెలుగులో నిరీక్షణ సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాను చందర్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో అర్చన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో ఈ మూవీ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అర్చన ఇప్పుడు తిరిగి సినిమాల్లో రాణించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ సినిమాలో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో అర్చన నటిస్తున్నారు. షష్టిపూర్తి అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అర్చన కీలక పాత్రలో నటిస్తున్నారు. పవన్ ప్రభ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చాలా కాలాంతర్వత అర్చన తిరిగి సినిమాల్లో నటిస్తుండటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 🎭🎞️