ఒకప్పుడు 30 కోట్ల రెమ్యునరేషన్..
- MediaFx

- May 21, 2024
- 1 min read
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతకొంత కాలం నుంచి ఈ హీరో ఖాతాలో హిట్ సినిమానే పడలేదు. ఈ మధ్యకాలంలో 'బడే మియాన్ చోటే మియాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా అభిమానులను నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు ఈ స్టార్ హీరో కెరీర్ కష్టంగా మారింది. అంతకుముందు విడుదలైన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. దీంతో ప్రస్తుతం ఈ హీరో చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు.అయితే తాజాగా టైగర్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టైగర్ ష్రఫ్ రెమ్యూనరేషన్ ను 70 శాతం తగ్గించుకోవాలని డిమాండ్ చేసారని సమాచారం. 'బడేమియాన్ చోటే మియాన్' సినిమాకుగానూ ఆయన రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఆ లెక్కన ఆలోచిస్తే ఇప్పుడు చేయబోయే సినిమాలకు కేవలం రూ.9 కోట్లు మాత్రమే తీసుకోవాలి. ఇది విన్న అభిమానాలు ఒక్కసారిగా షాకయ్యారు. టైగర్కు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. త్వరగా కబ్బ్యాక్ ఇచ్చి మళ్లీ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నారు.











































