🎭🎬 హీరో నితిన్ నటించిన గత చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 🎬🎭🎬 దీంతో కాస్త గ్యాప్ తీసుకుని ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమాలో నితిన్ నటిస్తున్నాడు. 🎬🎭 శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 🎭🎥 నితిన్ 32 అనే వర్కింగ్ టైటిల్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. 🎥🎉📅 ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 23న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 🎉📅📸 ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. భుజాన బ్యాగ్ వేసుకుని నితిన్ వెలుతున్న.. వెనుక వైపు నుంచి ఉన్న చిత్రం అది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 📸🎬🎉🎭📸📅🎥🎈