top of page

🌐🚨 ఏపీ అసెంబ్లీ వేళ కమలం క్యాడర్‌‌లో కొత్త కన్‌ఫ్యూజన్..

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో పొత్తు వ్యవహారం గందరగోళానికి గురి చేస్తోంది. 📢 ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక లక్ష్యంగా జరిగిన తొలిరోజు సమావేశంలో పొత్తు అంశంపై కొందరు బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. 🗣️ పొత్తు అంశంపై చర్చ జరిగిందని కొందరంటే.. పొత్తు వ్యవహారంపై అసలు చర్చే లేదని మరికొందరు చెప్పడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. 🔍 పొత్తు సంగతి పక్కనబెడితే.. అసలు చర్చ జరిగిందా.. లేదా?.. అనే అంశం కూడా కమలం పార్టీ క్యాడర్‌ను కన్‌ఫ్యూజ్‌ చేస్తోంది. 🤔

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏపీలో బీజేపీ దూకుడు పెంచుతోంది. 🔀 పొత్తులతో సంబంధం లేకుండా అన్ని స్థానాల్లో పోటీ చేయడమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తోంది. 🗳️ ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి అధ్యక్షతన విజయవాడ వేదికగా తొలిరోజు 14 జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. 🔥 ఇవాళ మిగిలిన జిల్లాల నేతలతో మీటింగ్‌ ఉంటుంది. ఈ సమావేశాల్లో పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి స్క్రీనింగ్‌ చేస్తున్నారు నేతలు. 🤝 ఇప్పటికే ఎన్నికల కోర్ కమిటీ, త్రి మెన్ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా ఏపీ బీజేపీ అధినాయకత్వంతోపాటు జాతీయ నేతలతో కలిసి మరింత వడపోతలు చేస్తున్నారు. 🇮🇳

అయితే.. ఈ సమావేశాల్లో పొత్తు అంశం సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. ⚡ మొదటి రోజు సమావేశంలో పాల్గొన్న కొందరు బీజేపీ నేతలు పొత్తు అంశానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం పార్టీలో కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేస్తోంది. 🤷‍♂️ పొత్తు అంశంపై అన్ని జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌. 🗣️ పొత్తు ఉంటే పరిస్థితి ఏంటి?.. లేకపోతే ఎలా ఉంటుందనే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. 🤨

ఏపీలో పార్టీ బలం, అభ్యర్ధుల బలాబలాలపై చర్చించామన్నారు బీజేపీ మరో సీనియర్‌ నేత విష్ణుకుమార్‌రాజు. 📣 ఎన్నికల వ్యూహం, అభ్యర్ధుల ఎంపిక, పొత్తు అంశాలపైనా ఫోకస్‌ చేసినట్లు చెప్పారు. 🎯 ఇదిలావుంటే.. పొత్తుపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ్‌. 🔍 పొత్తు ఆంశంపై నేతల అభిప్రాయాలు వారి వ్యక్తిగతమేనని తేల్చి చెప్పారు. 2️⃣5️⃣ పార్లమెంటు, 1️⃣7️⃣5️⃣ అసెంబ్లీ స్థానాల్లో ఎలా‌ పోటీ చేయాలనేదానిపైనే దృష్టి సారించామని చెప్పాము. 🌐

 
 
bottom of page