నిహారిక సినిమా కలెక్షన్ల జాతర..
- MediaFx

- Aug 12, 2024
- 1 min read
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. మొత్తం 11 మంది కొత్త కుర్రాళ్లు ఈ సినిమాలో హీరోలుగా నటించడం విశేషం. యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 09న గ్రాండ్ గా రిలీజైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పల్లెటూరిలో జరిగే ఓ జాతర, ఎన్నికలను నేపథ్యంగా తీసుకుని కమిటీ కుర్రోళ్లు సినిమాను తెరకెక్కించారు. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. చిన్న సినిమానే అయినా మొదటి రోజు రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన కమిటీ కుర్రోళ్లు వీకెండ్ లో మరింతగా అదరగొట్టింది. మౌత్ టాక్ బాగుండడంతో విడుదలైన మూడు రోజుల్లో నిహారిక సినిమా రూ. 6.04 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే మరో మూడు రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం రానుంది. ఆగస్టు 15న రామ్ పోతినేని, రవితేజల సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఈ బడా సినిమాలను తట్టుకుని నిహారిక సినిమా ఏ మేర నిలబడుతుందో చూడాలి. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ట్రేడ్ వర్గాలంటున్నాయి. సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.












































