top of page

జనసేన పార్టీలో బకెట్‌ సింబల్‌ చిచ్చు..?🗳️✨

Updated: Apr 14, 2024

పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతుంది అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుండి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు.

ree

గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం శాసనసభ స్థానాల నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలవడం తప్పనిసరి పరిస్థితి. అయితే రాజకీయాలు అంటేనే ఎత్తులు, పై ఎత్తులు. పిఠాపురం ఎన్నికల్లో పవన్ గెలుపుకు నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తలనొప్పిగా మారబోతుందా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఎలక్షన్స్‌ అంటే ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తుంటాయి చిన్న పార్టీలు. ఎందుకంటే తమ పార్టీ అభ్యర్థుల పేర్లతో బరిలో దిగుతారన్న దిగులు ఓవైపు. అంతకంటే పెద్ద తలనొప్పి ఏంటంటే తమ పార్టీ గుర్తుని పోలిన గుర్తులేమైనా వస్తాయేమోనన్న భయం ఇంకోవైపు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అలాంటి చిక్కే వచ్చిపడింది. నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్. ఇది జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును పోలి ఉండడం ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణులకు గుబులు రేపుతున్నది. జనసేనకు ఓటు వేయాలనుకున్నవారు గ్లాసు అనుకుని బకెట్ గుర్తుకు ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు చిక్కులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. అసలే పవన్ కళ్యాణ్ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. బకెట్ గుర్తుకు తోడు కొణిదెల పవన్ కళ్యాణ్ మాదిరిగా ఇంటి పేరు కె అక్షరం వచ్చే పలువురు పవన్ కళ్యాణ్ లను ఎన్నికల బరిలోకి దింపాలన్న ప్రయత్నాలు నడుస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పిఠాపురం బరినుండి పవన్ గట్టెక్కుతాడా ? లేక బకెట్ తన్నేస్తాడా ? అన్నది వేచిచూడాలి.🗳️


 
 
bottom of page