top of page

పేరు మార్చుకున్న ఆకాష్ పూరి..


రొమాంటిక్‌, చోర్‌బజార్‌ అనే సినిమాలు చేశారు ఆకాష్. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇస్తూ వస్తున్నాడు ఆకాష్. ఇదిలా ఉంటే తాజాగా ఆకాష్ పూరి తన పేరు మార్చుకున్నాడు. ఇక పై తన పేరు ఆకాష్ పూరి కాదని.. ఆకాష్ జగన్నాథ్ అని అనౌన్స్ చేశాడు. అయితే తన పేరు మార్చుకోవడం వెనక ఉన్న కారణం చెప్పలేదు ఆకాష్. ఈ మేరకు ఆకాష్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ఇన్‌స్టాలో పోస్ట్‌ లో తన పేరు మార్చుకుంటున్నట్టు అనౌన్స్ చేశాడు ఆకాష్. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన పేరు మార్చుకున్నాడు. మదర్స్ డే సందర్భంగా తన పేరును తన తల్లి పేరును కలుపుతూ.. సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నారు. ఇప్పుడు ఆకాష్ కూడా తన పేరును తన తండ్రి పేరును కలిసి ఇలా ఆకాష్ జగన్నాథ్ గా మార్చుకున్నాడు.



 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page