శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా నాగ్ అశ్విన్.. తొలి జీతం ₹4,000!
- MediaFx

- Jun 26, 2024
- 1 min read
యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "కల్కి 2898 ఏ.డి." భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని మూడు ప్రపంచాలను సృష్టించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాను చూసేందుకు జనాలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా కలియుగాంతంలో అవతరించే కల్కి అవతారం గురించి, కాశీ, కాంప్లెక్స్, శంబలా అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథే ఇది.
పాన్ ఇండియా లెవల్లో వినిపించిన నాగ్ అశ్విన్ పేరు ఇప్పుడు కల్కి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలను మాత్రమే తెరకెక్కించినా తనదైన దర్శకత్వంతో విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేశాడు. "ఎవడే సుబ్రహ్మణ్యం"తో మొదలైన ప్రయాణం, "మహానటి"తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు "కల్కి 2898 ఏ.డి"తో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.
రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాను తెరకెక్కిస్తున్నా నాగ్ అశ్విన్ చాలా సింప్లిసిటిగా ఉంటాడు. చిన్నప్పటి నుంచే కథలు రాయడం అలవాటు. స్కూల్ లో ప్రకృతిని నాశనం చేస్తున్నదెవరు అనే కథనం రాసి స్కూల్ ప్రిన్సిపల్ చేత దెబ్బలు తిన్నారు. నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు వైద్యులు. హీరో రానా దగ్గుబాటి, నాగ్ అశ్విన్ ఇద్దరూ క్లాస్ మేట్స్. వీడియో ఎడిటింగ్ పై పట్టు సాధించారు. సినీ పరిశ్రమలోకి వెళ్లేందుకు తనను తాను నిరూపించుకునేందుకు అండగా ఉన్నారు నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు.
తల్లి జయంతి ప్రోత్సాహంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. అప్పుడు గోదావరి సినిమా తెరకెక్కిస్తున్న శేఖర్ కమ్ముల తర్వాత ప్రాజెక్టుకు పిలిచారు. ఈ సమయంలో "నేను మీకు తెలుసా" సినిమాకు పనిచేశారు. అప్పుడు నాగ్ అశ్విన్ తొలి సంపాదన ₹4,000. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన "లీడర్", "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" సినిమాలకు పనిచేశారు.
₹4,000 మొదటి జీతం పొందిన నాగ్ అశ్విన్ ఇప్పుడు ₹600 కోట్లతో సినిమా నిర్మిస్తున్నారు. "కల్కి 2898 ఏ.డి"లో ప్రభాస్, దీపికా పదుకొణే, దిశా పటానీ, శోభన, కమల్ హాసన్, మాళవిక నాయర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.












































