పవన్‌ను ఓడించలేకపోయిన ముద్రగడ సంచలన ప్రకటన
- MediaFx

- Jun 5, 2024
- 1 min read
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఓడించలేకపోవడంతో తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. ఎన్నికల ముందు పవన్‌ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని చేసిన శపథం ప్రకారం ఇప్పుడు తన పేరు మార్పు ప్రక్రియ ప్రారంభించారు. రెండు, మూడు రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు చెప్పారు.
ముద్రగడ పద్మనాభం ఎన్నికల ఫలితాలపై కూడా స్పందించారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని, కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదన్నారు. సంక్షేమానికి ప్రజలు ఓటు వేయకపోతే రాబోయే రోజుల్లో ఏ సీఎం కూడా అటువైపు చూసే అవకాశం లేదన్నారు. గెలిచిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.












































