top of page

పారిస్‌ ఒలింపిక్స్‌ పతక విజేతలతో మోదీ భేటీ..


ree

గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి షూటర్‌ మను భాకర్‌, సరజ్జోత్‌ సింగ్‌, పురుషుల హాకీ జట్టు సహా ఒలింపిక్స్‌ పతక విజేతలు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం వారంతా నేరుగా ప్రధాన మంత్రి అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ మోదీతో భేటీ అయ్యారు.


ఈ భేటీ సందర్భంగా భారత పురుషుల హాకీ జట్టు (Hockey team) ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ప్రత్యేక బహుమతి అందజేసింది. ఆటగాళ్లంతా సంతకం చేసిన జెర్సీని గుర్తుగా అందజేసింది. కాగా, ఇటీవలే ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌ మొత్తం ఆరు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు సాధించింది. పతకాల పట్టికలో మన దేశం 71వ స్థానంలో నిలిచింది.



 
 
bottom of page